సీఎం కేసీఆర్(CM KCR) తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. ఇప్పటికే 6 లక్షల కోట్లు అప్పులు చేసి ఇప్పుడు హైదరాబాద్ భూములపై పడ్డారని విమర్శించారు.
మే 27న న్యూఢిల్లీలో జరగాల్సిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) హాజరుకావడం లేదని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో నీతి అయోగ్ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవడం విధి నిర్వహణలో లోపమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఔటర్ రింగ్ రోడ్డు(ORR)పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.రేవంత్‌రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) లీగల్ నోటీసులు పంపింది. ORR లీజుపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికింది.
తెలంగాణ (Telangana) లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతోందని వచ్చే ఎన్నికల్లో మూడో సారి అధికారాన్ని చేపట్టబోతోందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చిన వీరిద్దరూ మరోసారి పర్యటించనున్నారు. ప్రగతి భవన్ లో ముగ్గురు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. వీటితో పాటు పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం, జాతీయ రాజకీయాలు, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు వంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది.
ఆగ్రహం కట్టలు తెంచుకున్న కార్యకర్తలు ఐటీ అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరాభవం ఎదురవడంతో సోదాలు చేయకుండానే వారు వెనుదిరిగారు. కాగా ఈ దాడిని ఐటీ శాఖ తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం.
తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు ప్రగతి భవన్, ఫాంహౌస్ కూడా దాటడంలేదని అన్నారు.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ తొమ్మిదేళ్లలో మోడీ ప్రభుత్వ విజయాల గురించి బీజేపీ(BJP) గొప్ప సంప్రదింపు ప్రచారాన్ని నిర్వహించబోతోంది.