TG: రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా తీరుపై మాజీమంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. హైడ్రా తీసుకునే చర్యలు పేదలు, మధ్య తరగతికే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. FTL, బఫర్ జోన్, HFL జోన్లలోని పేదల ఇళ్లను మాత్రమే కూల్చేస్తారా అని నిలదీశారు. హైడ్రా నిబంధనల్లో ధనవంతులు, పెద్దవాళ్లకు మినహాయింపు ఉంటుందేమో అని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.