TG: నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ‘పార్టీ ఇన్ పర్సన్’గా కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టొద్దంటూ హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయం చూసుకునేంత వరకు బాధితులకు సమయం ఇవ్వాలని స్పష్టం చేసింది.