లెబనాన్‌లోని హెజ్బొల్లాలో తీవ్రవాదుల పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చేసింది. దీని వెనుక ఇజ్రాయెల్‌కు చెందిన 8200 ఓ రహస్య యూనిట్ పనిచేసినట్లు తెలుస్తోంది. దీనిని ‘యహిద షమోనే మతాయిమ్’ అని కూడా అంటారు. ఇందులో యువ ప్రతిభావంతులు, సృజనాత్మకంగా ఆలోచించే వారు, సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. వీరికి హ్యాకింగ్, ఎన్క్రిప్షన్, నిఘా వంటి సంక్లిష్టమైన శిక్షణలు ఇస్తారు.