ఈ ఎన్నికల ఇప్పటి వరకు వచ్చిన వాటి కన్నా ఎంతో ముఖ్యమైనవని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడారు. ఇంకో వారంలో ప్రజలు తీసుకునే నిర్ణయం వారు, వారి కుటుంబాలు, దేశ భవిష్యత్తుపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనుందని పేర్కొన్నారు. అమెరికన్ ప్రజల జీవితాలని మార్చేసే ఓటు ఇది అని చెప్పారు. స్వేచ్ఛ ఉండాలా? గందరగోళం, విభజన కావాలా?.. నిర్ణయం మీ చేతుల్లోనే ఉందని అన్నారు.