తూర్పు స్పెయిన్లో మెరుపు వరదలు పోటెత్తాయి. స్వల్పకాలంలోనే వీధులు నదులను తలపించగా.. కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కనీసం 72 మంది వరదల్లో మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. రోడ్లు, రైల్వే ట్రాక్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఎమర్జెన్సీ రెస్సాన్స్ యూనిట్ నుంచి వేయి మంది సైనికులు సహాయకపనుల్లో మునిగిపోయారు.