NCP నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధిఖీని హత్య చేయడానికి ముందు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్తో నిందితులు సంప్రదింపులు జరిపినట్లు ముంబై పోలీసులు తెలిపారు. స్నాప్‌చాట్ ద్వారా నిందితులు తరచూ చాట్ చేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు, మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.