బాబా సిద్ధిఖీ దారుణ హత్యతో సల్మాన్‌ఖాన్ తీవ్ర కుంగుబాటుకు గురయ్యారని బాబా సిద్ధిఖీ తనయుడు జిశాన్ తెలిపారు. ఆ బాధతో సల్మాన్ రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రతిరోజూ తనకు ఫోన్ చేస్తున్నారని, యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారని వెల్లడించారు. తన కుటుంబానికి ఆయన ఎంతో సపోర్ట్‌గా నిలిచారని జిశాన్ వ్యాఖ్యానించారు.