హమాస్, ఇజ్రాయెల్ మధ్య గతేడాది నుంచి యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, హమాస్ సంధి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ మేరకు గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో తమ స్పై చీఫ్ పాల్గొంటారని ఇజ్రాయెల్ వెల్లడించింది. అలాగే ఈ ఒప్పందం జరిగే సూచనలు కనిపిస్తే యుద్ధాన్ని ఆపేస్తామని హమాస్ వర్గాలు తెలిపాయి. కాగా, హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి ఒక ఒప్పందానికి దారి తీయగలదని ఇటీవల అమెరికా వెల్లడించింది.