AP: వైవీ సుబ్బారెడ్డిని అడగాల్సిన విషయాలపై ప్రధానికి లేఖ రాస్తే ఉపయోగమేంటని మాజీ సీఎం జగన్ను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. ‘సుబ్బారెడ్డికి స్వామి పట్ల ఎంత భక్తి ఉందో.. భూమన కరుణాకర్ రెడ్డి ఎంతటి స్వామి భక్తుడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. టీటీడీలో దొంగల ముఠాను పెట్టి లడ్డూల నుంచి అన్న ప్రసాదాల వరకు దోపిడీ చేశారు. నెయ్యి పేరిట రూ.450 కోట్లు దోచుకుంటే.. శ్రీవారి సంపద ఎంత కాజేశారో తెలియాలి’ అని ఫైర్ అయ్యారు.