AP: వైఎస్ షర్మిలపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆమె లాంటి చెల్లెలు జగన్కు ఉండడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ తన మెట్టినిల్లు అని చెప్పిన షర్మిల.. చివరకు అక్కడ చాప చుట్టి ఏపీకి వచ్చారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరులంతా జగన్ వెంటే నడిచారని గుర్తు చేశారు. టీడీపీతో కలిసి తమ పార్టీ అధినేతపై విమర్శలు చేయడం తగదన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేయడం మాకు గర్వకారణమని పేర్కొన్నారు.