AP: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ ఫంక్షన్ హాలులో విష్ణు-సాయిసాత్విక నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం వారికి శుభాకాంక్షలు చెప్పారు. నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబును వెంకయ్య సాదరంగా ఆహ్వానించారు.