కాకినాడ: రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గురువారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరిగే ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు కాకినాడ నగరం, దుమ్ములపేట నందు బయోమెథనేషన్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.