GNTR: అఖిల భారత పశుగణన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం రాత్రి 21వ కార్యక్రమ గోడపత్రికలు, కరపత్రాలు ఆయన కలెక్టర్ పి.అరుణ్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబరు 25 నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు పశుగణన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.