TG: విశాఖపట్నం కలెక్టరేట్లో విశాఖ, అనకాపల్లి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడు రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక ఆవిష్కరిస్తామన్నారు. పది పాయింట్లతో కూడిన అభివృద్ధి ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందంజలో ఉంటామన్నారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు, నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో గ్రోత్ హబ్, రోడ్ల అనుసంధానం తదితర పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.