AP: ఈనెల 9న వాలంటీర్ల ఆవేదన సదస్సు నిర్వహించనున్నట్లు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య వెల్లడించారు. సీఎం చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎనిమిది కేబినెట్ భేటీలు జరిగినా వాలంటీర్ల గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. ఈనెల 6వ తేదీన జరగనున్న కేబినెట్లో వాలంటీర్లకు న్యాయం చేయాలన్నారు.