ఖాతాదారులకు ఎస్బీఐ ఓ కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది. స్కామర్లు మోసపూరిత సందేశాలను ఎస్బీఐ కస్టమర్లకు పంపిస్తున్నట్లు తెలిపింది. ఎస్బీఐ రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేయమని కొందరు మెసేజ్లను పంపిస్తున్నారని పేర్కొంది. ఇటువంటి మెసేజ్లను నమ్మి లింక్ మీద క్లిక్ చేస్తే మోసపోతారని హెచ్చరించింది. కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.