కెనడాలోని బ్రాంప్టన్లో ఆలయంలో హిందువులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేసిన ఘటనను భారత్లోని ప్రముఖులు ఖండించారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ తాజాగా స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కెనడాలోని హిందువులపై జరిగిన దాడి హృదయాన్ని తాకింది. ఇది వేదన, ఆందోళన రెండింటినీ రేకెత్తించింది’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. కాగా, కెనడా ప్రభుత్వం ఈ ఘటనపై చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.