శరీరంలో ఐరన్ లోపిస్తే చిన్న పనికే అలసట ఆవహిస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవటం, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది, తలనొప్పి, జుట్టు ఎక్కువగా రాలటం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఐరన్ లోపిస్తుందని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మటన్, చికెన్ లివర్, గుడ్లు, చేపలు తినటం వల్ల శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పాలకూర, తోటకూర, క్యాబేజీ, బీన్స్ వంటి కూరగాయలు.. తృణధాన్యాలు, ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే ఫలితం ఉంటుంది.