RBI డిప్యూటీ గవర్నర్ పదవికి ఆర్థిక శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ మైకేల్ పాత్రా పదవీకాలం 2025 జనవరి 14న ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రజా ఆర్థిక సంస్థలో 25 ఏళ్ల అనుభవం ఉండి.. 2025 జనవరి 15 వరకు 60 ఏళ్లకు మించి ఉండకూడదు. 2024 నవంబరు 30లోగా దరఖాస్తులు పంపించాలి. ఎంపికైన వ్యక్తి కీలక రేట్లపై నిర్ణయాలు తీసుకునే ద్రవ్యపరపతి విధాన కమిటీ(MPC) సభ్యుడిగా వ్యవహరించాల్సి ఉంటుంది.