అమెరికాలో ఎన్నికల వేళ.. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణ కొరియా మిలిటరీ వెల్లడించింది. అటు జపాన్ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని తెలిపింది. ఇదిలా ఉండగా.. గత వారం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు స్వయంగా ఉత్తర కొరియా ప్రకటించింది. కిమ్ సమక్షంలో జరిగిన ఈ ప్రయోగం దేశ భద్రతకు ముప్పు కలిగించే శత్రువుల ఎత్తుగడలకు ప్రతిస్పందన చర్య అని ఆయన అభివర్ణించారు.