AP: వ్యవసాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సాంకేతికతతో అన్నదాతల సాగు ఖర్చులు తగ్గించాలని సూచించారు. ప్రకృతి సేద్యం రానున్న రోజుల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని తెలిపారు. ప్రకృతి సేద్యం, అగ్రిడీప్ టెక్ విధానంతో దేశానికి ఏపీ దిక్సూచిగా నిలవాలన్నారు. డ్రోన్ల ద్వారా పిచికారీతో 30 శాతానికిపైగా పురుగు మందు ఆదా చేయొచ్చని చెప్పారు. వచ్చే రబీ నుంచి రైతులకు పాత పద్దతిలో పంట బీమా అందిస్తామని వెల్లడించారు.