VSP: కార్తీక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖ బీచ్ రోడ్డులో గల గోకుల్ పార్క్లో ఈనెల 15న రాధాకృష్ణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు నగర మేయర్ హరి వెంకట కుమారి తెలిపారు. యాదవ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు పల్లా సింహాచలం, మాజీ అధ్యక్షులు భరిణికాన రామారావు ఈ ఉత్సవానికి సంబంధించి ప్రణాళికను రూపొందించినట్లు పేర్కొన్నారు.