ఇండియన్ రిచ్చెస్ట్ సినీ నటుడు ఎవరని అడిగితే వెంటనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పేరే చెబుతారు. మొదట సిరీయల్స్తో కెరీర్ ప్రారంభించి ఆపై వెండితెరపైనా తన సత్తా చూపించాడు. ఇక ఆయన ఆస్తులు రూ.7300 కోట్లకు పైమాటే అని చెప్పవచ్చు. సినీ, వ్యాపార ప్రకటనలు, IPL వంటి వాటిపై భారీగానే సంపాదిస్తున్నారు. అలాగే, ఒక్కో సినిమాకు రూ.120 నుంచి రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.