చార్ధామ్లోని గంగోత్రి, యుమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలు ఇవాళ్టి నుంచి మూతపడనున్నాయి. చలికాలం దృష్ట్యా నాలుగు ఆలయాలను 6 నెలలపాటు మూసివేయనున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది. మే 10న ప్రారంభమైన యాత్రలో భాగంగా నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను నిన్న మధ్యాహ్నం మూసివేశారు. కేదార్నాథ్ ఆలయాన్ని ఇవాళ ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నారు.