AP: రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్‌తోపాటు తెల్ల రేషన్, ఆధార్ కార్డు ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముందుగా డబ్బులు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోగా వారి ఖాతాల్లో నగదు జమ అవుతుంది. నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు.