AP: పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఈ నెల 25వ తేదీ నుంచి వారం రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ నెల 29న లాస్‌వెగాస్‌లోని సీజర్స్ ప్యాలెస్‌లో ఐటి సర్వ్ అలయెన్స్ సంస్థ ‘సినర్జీ’ పేరుతో నిర్వహించే కీలకమైన వార్షిక సమావేశానికి మంత్రి లోకేశ్ విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు.