TG: ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఇవాళ మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. నిన్న ఆయనను 8 గంటలపాటు ఈడీ విచారణ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగరంలో 42 ఎకరాల భూమి కేటాయింపుపై ఈడీ ప్రశ్నించింది. అధికారులు ప్రభుత్వ భూమిని తప్పుడు రికార్డు సృష్టించి పట్టా పాసుపుస్తకాలు జారీ చేశారు. అప్పటి రంగారెడ్డి కలెక్టర్గా అమోయ్ కుమార్ ఉండటంతో ఈడీ విచారణ చేస్తున్నట్లు సమాచారం.