TG: నేడు రాష్ట్రానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రానున్నారు. పలు కమిటీలతో విడివిడిగా సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. బీజేపీ అనుబంధ మోర్చాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో సమావేశం అవుతారు. సంస్థాగత ఎన్నికల కమిటీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, సభ్యత్వం, స్థానిక ఎన్నికలపై చర్చించనున్నారు.