AP: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ పేరును మార్చింది. అయితే రాష్ట్రంలో కొత్త వైద్య కాలేజీలకు గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టింది. దీంతో ఈ కాలేజీల పేర్లను ప్రభుత్వం మార్చింది. తాజాగా మచిలీపట్నం వైద్య కాలేజీ పేరును పింగళి వెంకయ్య ప్రభుత్వ మెడికల్ కళాశాలగా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.