AP: వైసీపీని వీడనున్న వాసిరెడ్డి పద్మ మాజీ సీఎం జగన్‌కు రాజీనామా లేఖ పంపారు. ఈ నేపథ్యంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్‌బుక్ కాదు.. గుండె బుక్. ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయ పార్టీ కంపెనీ కాదు. పార్టీని నడిపించటంలో జగన్‌కు బాధ్యత లేదు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణి ఉన్న నాయకుడిని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసింది’ అని పేర్కొన్నారు.