రష్యా సైన్యం నుంచి ఇప్పటి వరకు 85 మంది భారతీయులు డిశ్చార్జ్ అయ్యారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. మరో 20 మంది భారతీయులను విడుదల చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రష్యాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మిగిలిన భారతీయుల విడుదల సమస్యను భారత్ పక్షం లేవనెత్తుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.