రష్యా కజన్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో ఇద్దరు నేతలు చర్చలు జరపడం ఇదే తొలిసారి.