TG: మూసీ పునరుజ్జీవానికి చంగ్చియాన్ నది స్ఫూర్తి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘చంగ్చియాన్ నది పునరుజ్జీవం తర్వాత టూరిస్ట్ హబ్‌గా మారింది. దాని ప్రక్షాళనకు ముందు ఆందోళనలు జరిగాయి. కానీ ప్రభుత్వ నిర్ణయానికి స్థానికులు సహకరించారు. ప్రక్షాళన తర్వాత మూసీ నది కూడా ఇంతే అందంగా మారుతుంది’ అని పేర్కొన్నారు.