TG: సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ తల్లి విగ్రహ ధ్వంసం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. తెలంగాణ సమాజం ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను ప్రోత్సహించదని తెలిపారు. ఎంతటి వారైనా తప్పు చేస్తే ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించమని తేల్చి చెప్పారు.