TG: 2022లో విడుదలైన పోలీసు నోటిఫికేషన్ నియామకాల్లో జీవో 46 వల్ల అన్యాయం జరిగిందని గత 14 నెలలుగా నిరుద్యోగులు పోరాడుతున్నారు. అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గాలికి వదిలేసిందని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. దీంతో జీవో 46 అభ్యర్థులు రేపు పెట్రోల్ బాటిల్స్‌తో సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.