AP: రాష్ట్ర ప్రజలతోపాటు పక్క రాష్ట్రాల్లోనూ మరో గంటలో ఏపీలో ఏం జరగనుందని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గురువారం మధ్యాహ్నం బిగ్ ఎక్స్పోజ్ అంటూ TDP ట్వీట్ చేసిన 2 గంటల వ్యవధిలో YCP తన ట్విట్టర్ ఖాతాలో అక్టోబర్ 24 మధ్యాహ్నం 12 గంటలకు ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్ అంటూ ట్వీట్ చేసింది. దీంతో అసలు మధ్యాహ్నం 12 గంటలకు రెండు బాంబులు పేలుతాయా.. ఒకటే పేలుతుందా.. లేదంటే రెండూ తుస్సుమంటాయా అనేది తెలియాలంటే 12 గంటల వరకు ఆగాల్సిందే.