TG: భద్రాద్రి పర్యటనలో ఉన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వెళ్లిన గవర్నర్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మణ సమేత సీతారాములకు గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీలక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో గవర్నర్కు పండితులు వేదాశీర్వచనం అందించారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.