TG: పోలీసుల విచారణకు సహకరించానని రాజ్ పాకాల తెలిపారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని.. ఫామ్‌హౌస్‌లో ఫ్యామిలీ పార్టీ జరిగిందన్నారు. ఫ్యామిలీ పార్టీ చేసుకోకూడదా అని ప్రశ్నించారు. విజయ్ మద్దూరి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. ఎవరికో పాజిటివ్ వస్తే తనకేం సంబంధం అన్నారు. జన్వాడ ఫామ్‌హౌస్ కేసులో రాజ్ పాకాలను మోకిల పోలీసులు 9 గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే.