TG: ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏర్పాటు చేసిన నూతన రైతు కమిషన్‌కు సభ్యులను నియమించింది. ఏడుగురిని సభ్యులుగా నియమిస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేవీ నర్సింహారెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మరికంటి భవానీ, న్యాయవాది సునీల్, రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు, గంగాధర్‌లను అపాయింట్ చేసింది. కాంగ్రెస్ నేత కోదండరెడ్డికి రైతు కమిషన్ చైర్మన్ పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే.