TG: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం సన్నగిల్లే పరిస్థితులను మళ్లీ తీసుకురావద్దని మాజీమంత్రి కేటీఆర్ సర్కార్‌ని కోరారు. ‘మందుల్లేవ్.. సూదిలేదు. జనాలను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల్లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. సర్కారు దవఖానాలపై ఎందుకింత నిర్లక్ష్యం. ఔషధాల కొరతకు కారణం ఎవరు. అంతా బాగుందని దబాయింపులు వద్దు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దు’ అని ట్వీట్ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.