TG: బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పొంగులేటితో కేటీఆర్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్న మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతుందే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లి కేసీ వేణుగోపాల్‌తో ఏం ఒప్పందం చేసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.