TG: ఓరియన్ విల్లాస్ దగ్గర BRS నేతలు ఆందోళనకు దిగారు. KTR ఇంటి వద్దకు పోలీసులు చేరుకోవడంతో పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ రకమైన డ్రామా చేస్తున్నారని, ఫామ్‌హౌజ్‌లో జరిగింది రేవ్ పార్టీ అని చెప్పడానికి ఆధారాలు ఏమైన దొరికాయా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కావాలనే ఇలాంటి డ్రామాలకు తెరలేపారని, మంత్రి పొంగులేటి చెప్పిన బాంబు ఇదేనా అని BRS నేత బాల్క సుమన్ ప్రశ్నించారు.