AP: రాజమహేంద్రవరం టూరిజం హబ్‌గా అడుగులేస్తోందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. రాజమండ్రిలో ఫ్లోటింగ్ బోట్ రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. గతంలో ఎక్కడా పర్యాటక అభివృద్ధి కనిపించలేదని అన్నారు. పర్యాటకానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. గోదావరి జిల్లా దేవాలయాలపై కమిటీ కూడా వేశారని చెప్పారు.