TG: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు విచారణ జరుగుతున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు. ఏ1గా ఫామ్‌హౌస్ సూపర్వైజర్ కార్తిక్, ఏ2గా రాజ్ పాకాల ఉన్నారని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించి పార్టీ నిర్వహించారని పేర్కొన్నారు. కర్ణాటక లిక్కర్‌తో పాటు విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏడు లీటర్ల విదేశీ మద్యాన్ని సీజ్ చేశామన్నారు. రాజ్ పాకాల పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.