చాలా మందిలో జుట్టు రాలే సమస్య ఉంటుంది. అలాంటి వారు తమ జుట్టును పట్టులాగ ఉంచుకునేందుకు షాంపులో తేనె కలిపి జుట్టుకు పెట్టుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. తల స్నానం చేసే ముందు మీరు ఉపయోగించే షాంపులో తేనె మిక్స్ చేసి గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గడంతో పాటు మృదువుగా మారి నల్లగా మెరుస్తుందట.