AP: తనపై ఆరోపణలు చేసి, ఫిర్యాదు చేసిన మహిళతో తనకెలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. ఆమె తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎలాంటి టెస్ట్లకైనా సిద్ధమని ప్రకటించారు. ఈ కుట్ర వెనుక ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోనని తేల్చి చెప్పారు. తన దగ్గర రూ.90 లక్షలు తీసుకోవడంతో పాటు శారీరకంగా వాడుకున్నాడని ఓ మహిళ మేరుగు నాగార్జునపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.