TG: గద్దర్ అవార్డుల కమిటీతో సీఎం రేవంత్ ఇవాళ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అవార్డుల ఎంపికకు విధివిధానాలపై వారితో సీఎం చర్చించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో సీఎం చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు వివిధ విభాగాల ముఖ్యకార్యదర్శులతో సీఎం సమావేశంకానున్నారు.