TG: నాగార్జునసాగర్‌కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో జలాశయం నుంచి అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 64,830 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులు ఉంది. జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది.