AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. కాకినాడలోని సంతచెరువు సెంటర్లో అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ని నగరపాలక సంస్థ అధికారులు జేసీబీతో తొలగించారు. అయితే ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు ద్వారంపూడి అనుచరులు యత్నించారు. కానీ ఈ నిర్మాణాలకు అనుమతులు లేవని చెప్పిన అధికారులు భారీ బందోబస్తు మధ్య కూలగొట్టారు.